ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 03, 2023, 12:20 PM

గుంటూరు జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మాతృ మరణాల నివారణ పై ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. పెద పలకలూరు, ఫిరంగిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాతృ మరణాలు సంభవించడం పట్ల వైద్యులు, అధికారుల నుంచి వివరణ కోరారు. ప్రాథమిక దశనుండే గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com