సీసీ కెమెరా వైర్లు తొలగించి ఇంట్లో చోరీకి యత్నించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టాభిపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు పండరీపురం 5వ లైనులో నాగూర్ గణేష్ ఇంటికి సోమవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు తలుపులు దగ్గరకు వేసి ఉండటంతో వాటిని తెరిచి ఇంట్లోకి ప్రవేశించారు. తొలుత టేబుల్‌పై ఉన్న సెల్‌ఫోన్ తీసుకున్నారు. నాగూర్ గణేష్, కుటుంబ సభ్యులు గమనించి కేకలు వేసి వారి వెంట పడ్డారు. తొలుత ఓ వ్యక్తి పారిపోయాడు. రెండో వ్యక్తిని గణేష్, కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు గణేష్ ఇంటికి చేరే సమయానికి రెండో వ్యక్తి కూడా తప్పించుకుని పారిపోయాడు. ఈఘటనపై పోలీసులు మంగళ వారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.