ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొవ్వూరు పర్యటన మరోసారి వాయిదా పడింది. గత నెల 14న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘వలంటీర్లకు వందనం’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అనుకోని కారణాలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి ఈ నెల 5న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈ పర్యటన మరోమారు వాయిదాపడినట్టు హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.