వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట, వల్లూరు మండలాల మధ్య ఉన్న బీచువారిపల్లె గ్రామానికి చెందిన సీతారామయ్యగారి కేశన్నకు 15 సంవత్సరాల క్రితం వెంకటసుబ్బమ్మతో వివాహం జరిగింది. వీరికి కుమార్తె దుర్గాలక్ష్మి(14), కుమారుడు (7) ఉన్నారు. బాలికకు ఏడు సంవత్సరాల క్రితం కాలేయ సమస్య ఎదురైంది. ఈ చిన్నారికి వైద్యం అందిస్తున్న సమయంలోనే వెంకటసుబ్బమ్మ కూడా అదే వ్యాధి బారినపడింది. దీంతో కేశన్న బతుకుదెరువు అయిన రజక వృత్తిని వదిలి వీరిని ఆస్పత్రులకు తిప్పాడు. భార్య, కూతురుకు కాలేయ వ్యాధి సోకడంతో ఉన్న ఎకరా పొలాన్ని అమ్మేసి వైద్యం చేయించాడు. అది చాలక ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెటి ్టనా భార్యను బతికించుకోలేకపోయాడు. వెంకటసుబ్బమ్మ (34) ఇరవై రోజుల క్రితం మృతిచెందగా.. దుర్గాలక్ష్మి మంచానికే పరిమితమైంది. కాగా.. కాలేయవ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తించలేదు. ఇప్పటికే రూ.15 లక్షలకుపైగా ఖర్చు చేసినా భార్యను బతికించుకోలేకపోయానని.. కుమార్తెను ప్రతి నెలా చెన్నై తీసుకెళ్లి చికిత్స చేయించాల్సి వస్తోందని, కనీసం ఖర్చులకు కూడా డబ్బులు లేవని కేశన్న ఆవేదన వ్యక్తంచేశాడు. దుర్గాలక్ష్మిని బతికించుకోవాలంటే రూ.40 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని కేశన్న వివరించాడు. ఫోన్‌పే నంబరు 9848169664 లేదా అకౌంట్ నంబరు 31671758017, ఐఎ్‌ఫఎసీ: ఎ్‌సబీఐఎన్ 0012675కు కానీ దాతలు నగదు పంపాలని విజ్ఞప్తిచేశాడు.