గంజాయి రవాణా, అమ్మకాలపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. జిల్లా సరిహద్దు గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి గురువారం ఆదేశించారు. గంజాయి వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని దీన్ని పూర్తిస్థాయిగా నిర్మూలిస్తామన్నారు. గంజాయి అమ్మకాల పై సమాచారం ఉంటే పోలీసు సిబ్బందికి తెలియజేయాలన్నారు. తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.