రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆపబోమని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నం సుబ్బయ్యయాదవ్, జా తీయ ప్రధాన కార్యదర్శి ఆనాల సురేష్ స్పష్టం చేశారు. గురువారం ఒంగోలులోని అంబేడ్కర్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 95 వేల మంది దివ్యాంగుల పింఛ న్లను తొలగించిందని, వాటిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. దివ్యాం గులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాలని, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 11 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద సమితి ఆధ్వర్యంలో ధర్నాలు చేప ట్టామన్నారు. ధర్నా కార్యక్రమంలో భాగంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ నెల 17వ తేదీన ఒంగోలు వస్తున్నారని వారు తెలిపారు.