విదేశాలలో ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే గిరిజన విద్యార్థులు జగనన్న విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమాధికారి మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. టోపెల్, జీ మేట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 200 ఉన్నత స్థాయి యూనివర్శిటీల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ కోర్సులకు ఆర్థికసాయం చేస్తామన్నారు. దరఖాస్తు చేసుకునే వారి కుటుంబ ఆదాయం రూ.8 లక్షలు మించకూడదని, 35 ఏళ్లలోపు వారై ఉండాలన్నారు. ఎంపికైన వారికి వందశాతం ట్యూషన్ ఫీజు, ఎకానమీ క్లాస్ టికెట్‌కు సరిపడా నగదు ఇస్తామన్నారు. కళాశాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని నాలుగు కంతుల్లో ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.