కమలాపురం మండలం రామాపురం క్షేత్రంలో వెలసిన శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణుడు, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజు శుక్రవారం కన్నులపండువగా జరిగాయి. మూడో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితులు సుదర్శన హోమం, స్త్రీ శక్తి హోమం, నవగ్రహ హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం మాడ వీధులలో మహాలక్ష్మి సమేత మోక్షనారాయణుడు గజవాహనం, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి అశ్వవాహనం పై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.