వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కృషి విజ్ఞాన కేంద్ర సమన్వయకర్త వీరయ్య, వాతావరణ విభాగం శాస్త్రవేత్త స్వామి చైతన్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.