ప్రత్తిపాడు మండలం వంగిపురం, మేడావారి పాలెం గ్రామాలలో శుక్రవారం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కల్లాల్లో నీట మునిగిన మిర్చి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు కళ్ళం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు, మొక్కజొన్న రైతులకు 25వేల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయా గ్రామాలలో రైతులతో మాట్లాడి నష్టం ఏ మేరకు ఉంది అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రత్తిపాడు మండల అధ్యక్షుడు గింజుపల్లి శివరాం ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ వెంటనే నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.