అకాల వర్షాలు కారణంగా దెబ్బతిన్న పంటలకు చెందిన రైతులు ఆదుకుంటామని పంచాయతీ రాజ్ కమిషనర్ సూర్యకుమారి తెలిపారు. జిల్లాలో నకరికల్లు, దేవవరం, చల్లగుండ్ల గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను శుక్రవారం కలెక్టర్ శివ శంకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 419 హెక్టార్ల వరి పంట, 9 హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లుగా అంచనా వేశామన్నారు. ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని హామీనిచ్చారు.