రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ ఆధ్వర్యంలో మందడం తాళ్లాయపాలెం జంక్షన్ వద్ద చేస్తున్న దీక్ష శిబిరం వద్ద ఉద్యమకారులు శనివారం బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచి పట్టుకున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చంద్రబాబు తన అనుచరులతో దాఖలు చేసిన పిటిషన్ కోర్టు కొట్టు వేయడం పై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.