గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీ వద్ద కు వరద నీరు భారీగా చేరుకుంటంది. ఈ క్రమంలో బ్యారేజీ నీటి మట్టం 12అడుగులకు చేరింది. అలానే బ్యారేజీ దిగువన ఉన్న మున్నేరు తదితర వాగుల నుండి సుమారు 4500 క్యూసెక్యుల నీరు రిజర్వాయర్ కు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో బ్యారేజీ 4గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు మూడువేల క్యూసెక్కుల నీటిని శనివారం విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ జే. ఈ దినేష్ తెలిపారు.