ఆపదలో అండగా నిలవడం. ప్రజలకు నిరంతరంగా అందుబాటులో ఉండటం, విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకపోవడం. ప్రజా సంక్షేమం కోసం పరితపించడం. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తత్వం. రాజకీయం ధనార్జన కోసం చేయడం లేదు. మానవ సేవే మాధవ సేవగా భావించి శ్రీవారి భక్తుడిగా చేస్తున్నారని చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం గడప గడపకు మాహా పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా చిన్నగొట్టిగల్లు మండలం నెల్లూట్లవారి పల్లి పంచాయతీ పరిధిలో వంగుమళ్లువారిపల్లి, బద్దలవారి పల్లి, ఎగువపూజారి వాండ్లపల్లి, దిగువపూజారి వాండ్లపల్లి, దిగువగుంతాటి వారిపల్లి, ఎగువగుంతాటి వారిపల్లి, నెల్లుట్లవారి పల్లి, ఉలవపాటి వారిపల్లి హరిజన వాడ, బొంబాయి చెరువుపల్లి, మట్లివారిపల్లి గ్రామాలలో పర్యటించారు. అడుగడుగునా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడిగా మోహిత్ రెడ్డి పట్ల ప్రజలు ఆప్యాయతను కనబరిచారు. మా ఎమ్మెల్యే తనయుడు అంటూ. తదేకంగా చూస్తూ. ఆత్మీయంగా పలకరించారు. అంతకుముందు సర్పంచ్, పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో మోహిత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. గజ మాలలతో ఘనంగా సత్కరించారు. మహిళలు పాదయాత్రకు ఎదురేగి హారతులు పట్టి ఆహ్వానం పలికారు. ప్రతి ఇంటికి వెళ్ళిన మోహిత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయా. అని ఆరా తీశారు. పథకాల బుక్ లెట్ ను అందజేశారు. ఏదేని సమస్య ఉందా అడిగారు. చాలా మంది తమకు ఏ సమస్యా లేదని చెప్పుకొచ్చారు.