రాజకీయాలలో కొత్త ఓరవడిని తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ప్రభుత్వ విప్, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. బుచ్చయ్యపేట మండలంలో కేపి. అగ్రహారం గ్రామ సచివాలయం పరిధిలో శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా, లేవా అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు, వైద్యం ఇంటింటికి అందజేస్తుంది అన్నారు. ఏ ఒక్క సమస్య వచ్చినా క్షణాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ముందు ఉంటుందన్నారు. ఇందులో భాగంగా గ్రామంలో రహదారి నిర్మాణాలు, కాలువ పనులు చేపట్టాలని పలువురు ఎమ్మెల్యే దృష్టికి వెళ్లారు. గృహాలకు బిల్లులు చెల్లించడం లేదని లబ్ధిదారులు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాకారపు నాగేశ్వరి దేవి నాగరాజు, జడ్పిటిసి దొండా రాంబాబు, వైస్ ఎంపీపీ గొంపా చినబాబు, మండల సచివాలయ కన్వీనర్ కోరుకొండ అప్పలనాయుడు, స్థానిక ఎంపీటీసీ & ఎంపీటీసీ ల ఫోరమ్ మండల అధ్యక్షులు దేవర అప్పారావు, గ్రామ సర్పంచ్ గోపిశెట్టి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ దేవర ముసిలినాయుడు, సచివాలయం కన్వీనర్ అడ్డూరు శ్రీను, మాజి సర్పంచ్ దేవర రమణ, పిఏసిఏస్ డైరెక్టర్ దేవర తాతబాబు, స్థానిక వైసీపీ నేతలు, గృహ సారధలు, మండల అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.