అరకులోయలోని రైల్వే రిక్వెస్టు స్టేజ్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు శవమై కనిపించాడు. ఇతను అరకులోయకు చెందిన రాఘవేంద్రవరప్రసాద్(17)గా గుర్తించారు. శుక్రవారం ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు రైల్వే ట్రాక్ మధ్య తీవ్ర గాయాలతో యువకుడు మృతిచెంది ఉండడాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జీఆర్పీఎఫ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను విచారించగా అరకులోయలోని కొండవీధికి చెందిన రాఘవేంద్రవరప్రసాద్గా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదవశాత్తూ రైలు ఢీకొనడంతో మృతిచెందాడా? ఇతనే ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేకపోతే ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశారా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు వెల్లడించారు.