ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికురాలికి తేలు కుట్టింది. అయితే వారంరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగపూర్ నుంచి ముంబైకు ఓ మహిళ AI 630 విమానంలో వెళ్తుండగా తేలు కుట్టిందని సిబ్బంది తెలిపారు. దీంతో విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆమెకు చికిత్స అందించి ఇంటికి పంపించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రయాణికురాలు క్షేమంగా ఉందని, ఆమెకు కలిగిన అసౌకర్యంపై క్షమాపణలు కోరారు.