దక్షిణ, తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఆవర్తనం సోమవారం ఉదయంలోగా అల్పపీడనంగా మారనుందని 9న ఇది తీవ్ర వాయుగుండం కానుందని వాతావరణ అధ్యయన కేంద్రం తెెలిపింది. 10న వాయుగుండం తుపానుగా మారనుండగా, దీనికి యెమన్ దేశం ‘మోచా’గా నామకరణం చేసింది. ఈ విపత్తు తీవ్ర రూపం దాలుస్తుందని త్వరలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని వాతావరణ అధికారులు వెల్లడించారు.