పాకిస్థాన్ కు చెందిన ఓ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. మే 4వ తేదీ రాత్రి 8గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాహోర్ విమానాశ్రయంలో భారీ వర్షం కురవడంతో మస్కట్ నుండి వస్తున్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(పీఐఏ) విమానం ల్యాండింగ్ విఫలమైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత గగనతలంలో పది నిమిషాలు ప్రయాణించి పంజాబ్‌లోని ఝగియాన్ నూర్ మహమ్మద్ గ్రామ సమీపంలో పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్లింది.