నేర నియంత్రణ లో భాగంగా నేరాలను అరికట్టెందుకు నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందు సమస్యత్మక ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని వెస్ట్ సబ్ డివిజన్ సిఐ కోన దుర్గ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 53 వ వార్డు పరిధి మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో సోమవారం స్పెషల్ నిర్వహించారు. ఈ మేరకు అటుగా రాకపోకల సాగిస్తున్న వాహనదారులను ప్రశ్నించారు. వాహనాల దృపత్రాలను పరిశీలించిన ఆయన నెంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్న వాహనాలను స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం నేపథ్యంలో ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచించారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రజలు ఇతర ప్రాంతాలకు బంధువుల ఇళ్లకు వెళుతూ ఉంటారని అటువంటి సమయంలో విలువైన వస్తువులతో పాటుగా నగదును బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. తద్వారా ఆయా ప్రాంతంలో పోలీసుల నిగా పెంచుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ సిబ్బందితో పూర్తిస్థాయిలో భద్రత పర్యవేక్షణ నిర్వహిస్తున్నామని అన్నారు. తమ ప్రాంతాల్లో అనుమానితులు సంచరిస్తే తక్షణం పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో క్రైమ్ ఎస్ ఐ లు కాంతారావు, ఉపేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.