పద్మనాభం, భీమిలి మండలాలలో ఆంధ్రప్రదేశ్ మార్పెఫెడ్ ఆధ్వర్యంలో వెలుగు మరియు సహాకార సంఘాల ద్వారా మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు గావించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. ఎస్. విశ్వనాధన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం వారి ఛాంబర్ లో మొక్కజొన్న కొనుగోలుగు సంబంధించి జిల్లా కొనుగోలు కమిటీ సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగినది. ఈ క్రాఫ్ చేయించి మొక్కజొన్న అమ్మదలచిన రైతులు తమ పేర్లను వారి యొక్క రైతు భరోసా కేంద్రాలలో ని సంప్రదించి తేదీ 12-05-2023 వరకు నమోదు చేసుకోవలసిందిగా కోరినారు. రైతు భరోసా కేంద్రాలా వద్ద ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించిన రైతులనుండి ఏపీ మార్క్ ఫెడ్ వారి ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయడం జరుగుతుంది అని తెలియ జేశారు ఒక క్వింటా ధర 1962/- గా గవర్నమెంట్ వారు నిర్ణయించడం జరిగింది. తేమ శాంతం 14% కంటే తక్కువగా ఉండేలా ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి శాంపిల్ తీసుకోని రావాలని తెలియ జేశారు. రైతులు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకొని గిట్టుబాటు ధర పొందాలని కోరినారు. ఈ సమావేశానికి అప్పలస్వామి జిల్లా వ్యవసాయ అధికారి. శోభారాణి , పి డి డి ఆర్ డి ఏమిల్టన్ జిల్లా సహకార అధికారి, యాసీన్ అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ సూర్య ప్రకాష్ జిల్లా సప్లై అధికారి కే రమేష్ జిల్లా మేనేజర్ ఏపీ మార్క్ ఫెడ్ తదితరులు పాల్గొన్నారు.