గత పదిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కాస్త చల్లటి వాతావరణం కనిపించింది. కానీ సోమవారం ఎండతోపాటు ఉక్కపోత పరిస్థితి కనిపించగా, ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. అకాల వర్షాలు సైతం తగ్గుముఖం పట్టాయి. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, కొన్ని ప్రదేశాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలిపింది.