IPL 2023లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడునుంది. ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్‌లో 5 గెలిచిన ముంబై, పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. మరోవైపు ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లో 5 గెలిచింది. రన్ రేట్‌లో ముంబై కంటే మెరుగ్గా ఉండటంతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఈ రెండు జట్లకు ప్లేఆఫ్ చేరేందుకు ఈ మ్యాచ్ కీలకం. దీంతో ఇవాళ మ్యాచ్‌లో గెలుపు కోసం హోరాహోరీగా తలపడనున్నాయి.