అన్నం వండలేదని ఓ భర్త తన భార్యను కొట్టి చంపిన దారుణ ఘటన ఒడిశాలోని సాంబల్ పూర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. జమన్ కిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌధి గ్రామానికి చెందిన సనాతన్ ధరువా (40) ఆదివారం రాత్రి ఇంటికి వచ్చే సరికి అన్నం వండలేదని భార్య పుష్ప ధరువాపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.