కుప్పం నుంచి విహార యాత్రకు వెళ్లిన ఇద్దరు యువకులు తమిళనాడు రాష్ట్రంలోని వేలాంకని బీచ్‌లో గల్లంతయ్యారు. కుప్పం పట్టణానికి చెందిన ఫయాజుల్లా, ఆశిష్, సంజయ్, బాబి అనే నలుగురు యువకులు సోమవారం ఉదయం వేలాంకనికి విహార యాత్రకు వెళ్లారు. అక్కడి సముద్రంలోని బీచ్‌లో ఈత కొడుతుండగా పెద్దపెద్ద అలలు వచ్చి వీరిపై పడ్డాయి. ఈ సమయంలో శాంతినగర్‌కు చెందిన ఫయాజుల్లా (18), కొత్తపేటకు చెందిన ఆశిష్ (19) అలలతోపాటు సముద్రంలోకి కొట్టుకుపోయారు. భయపడిన మిగిలిన ఇద్దరు ఒడ్డుకొచ్చి, స్థానికులకు సమాచారమిచ్చారు.