టెన్త్ ఫలితాల్లో గిరిజన గురుకుల పాఠశాలలు వెనుకబడటాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సీరియ్‌సగా తీసుకుంది. ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకు సంబంధించి సోమవారం విజయవాడలో గిరిజన సంక్షేమశాఖ అధికారులతో ఎస్టీ కమిషన్ చైర్‌పర్సన్ కె.రవిబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గిరిజన గురుకులాల్లో టెన్త్ పరీక్షల్లో 50 శాతం కంటే తక్కువ ఫలితాలు రావడంపై అధికారులతో సమీక్షించారు. టెన్త్ ఫలితాల్లో వెనుకబడిన గురుకులాల ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులివ్వాలని గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.