కడప నగరంలోని చిన్న బెస్తవీధికి చెందిన షేక్ రషీదాబాను, షేక్ దర్బార్‌బాషాకు ముగ్గురు కుమారులు, పెద్ద కుమారుడు మహమ్మద్ ఇలియాస్‌కు మతిస్థిమితం లేదు. రెండో కుమారుడు ఇషాక్ (25) మహారాష్ట్రలో, మూడో కుమారుడు అబూబసర్ స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాహం చేసుందుకు ఇషాకును తల్లి, బంధువులు కడపకు రప్పించారు. 13, 14 తేదీల్లో వివాహం నిశ్చయించారు. కాగా, చెడు వ్యసనాల కు బానిసైన అబూబసర్ సరిగా ఇంటికి రాకపోవడంతో అన్న ఇలియాస్, స్నేహి తుడు పీరుల్లాతో కలసి ఇషాక్ తమ్ముడి వద్దకు వెళ్లి మందలించాడు. దీంతో కోపోద్రిక్తుడైన అతను పిడిబాకుతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కడప టూటౌన్ సీఐ సయ్యద్ ఆసిఫ్ సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. నిందితుడిని పోలీసు లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.