చంద్రబాబు నిజమైన మనిషివి అయితే.. రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఎస్సీల సంక్షేమంపై చర్చకు రావాలి.. దళిత సంక్షేమం, దళిత అభివృద్ధి, దళితులపై దాడులు, అరాచకాలు, అఘాయిత్యాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల్లో పైసా అవినీతి జరిగిందని చంద్రబాబు నిరూపించగలడా అని సవాల్ విసిరారు. దళితుల మీద తుపాకీ పెట్టి ముఖ్యమంత్రిని కాల్చాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. దళితులకు సహాయం చేసే వ్యక్తిని, పేదలకు అండగా ఉండే వ్యక్తిని, మమ్మల్ని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకువస్తున్న నాయకుడి మీద బురదజల్లాలని, కుయుక్తులు పన్నాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.