గోదావరి రైతులకు న్యాయం జరగకపోతే ఉరే గతి అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల దగ్గర దౌర్జన్యంగా వసూలు చేస్తున్న డబ్బు.. తిరిగి ఇప్పిస్తే పోలీసు అధికారుల బూట్లు పాలిష్ చేస్తానని వెల్లడించారు. జిల్లా కలెక్టర్కు ఆత్మాభిమానం ఉంటే సెలవు పెట్టి వెళ్లిపోవాలన్నారు. రైతును ఎర్రిపప్ప అన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు క్షమాపణలు చెప్పాలన్నారు. దోపిడీ చేస్తున్న రైస్ మిల్లులను ఎందుకు సీజ్ చేయడం లేదని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.