ఏలూరు జిల్లా, పాలకొడేరు ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట రైతులు ఆందోళన దిగారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆధ్వర్యంలో రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే మంతెన రామరాజు ఎమ్మార్వోకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు.. ఎర్రిపప్పకు అర్దం తెలియదా? అని ప్రశ్నించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కైన మంత్రిగారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంతెన రామరాజు పేర్కొన్నారు