అకాల వర్షం వలన రైతులు రోడ్డున పడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు మన నీరో తాడేపల్లి పాలస్‌లో కూర్చుని చోద్యం చూస్తున్నాడని టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. నష్ట పోయిన రైతులకు ధైర్యం చెప్పాల్సిన్న ప్రభుత్వం ప్రతిపక్షంపై విమర్శలు చేస్తోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తే అనేక విషయాలు వెలుగు చూశాయన్నారు. రైతును భక్షించే కేంద్రాలుగా ఆర్‌బీకేలు ఉన్నాయన్నారు. తడిసిన ధాన్యాన్ని తీసుకెళ్తే లారికి 10 వేలు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. నాలుగేళ్లలో పంట కాపాడుకునేందుకు ఒక పరదా పట్టా అయినా ఇప్పించారా? అని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.