సిక్కుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అదే విధంగా గురుద్వారాలకు ఆస్తి పన్ను తొలగించాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని సిక్కు మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో పలు విషయాలపై చర్చించారు.