లైంగిక వేధింపుల కేసుల విచారణ సమయంలో సున్నితమైన హృదయం, అప్రమత్తమైన మనస్తత్వంతో ఉండాలని న్యాయమూర్తులను ఢిల్లీ హైకోర్టు అభ్యర్థించింది. తద్వారా విచారణ పరస్పరం సంబంధం లేని దిశలో సాగకుండా, బాధితురాలికి మరింత ఆవేదన లేదా అవమానం కలిగించదని పేర్కొంది. సాక్షులతో సహా అవసరమైన, ఆధునిక మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందించగలదని, అయితే ఇది న్యాయమూర్తి సున్నితమైన హృదయాన్ని సృష్టించదని జస్టిస్ స్వరణ కాంత శర్మ అన్నారు. అత్యాచారం కేసులో దోషిగా నిర్దారిస్తూ ట్రయల్ కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.
2010లో అత్యాచారం సహా ఐపీసీ సెక్షన్‌లో అనేక నేరాలకు సంబంధించి ట్రయల్ కోర్టు 10 ఏళ్లు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు చేసిన అప్పీల్‌ను హైకోర్టు విచారించింది. బాధితురాలి వాంగ్మూలంలో అనేక అసమానతలు, వైరుధ్యాలు ఉన్నందున.. విచారణ సమయంలో మైనర్ కావడం సహా అవాంతరాలు కలిగించే కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు నిందితుడ్ని విడుదల చేసింది.
12 ఏళ్ల చిన్నారికి కౌన్సెలింగ్ ఇచ్చిన కౌన్సెలర్‌ను డిఫెన్స్ సాక్షిగా విచారించేందుకు అనుమతించారని, కౌన్సెలింగ్‌కు సంబంధించిన రహస్య నివేదికను పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకురావడాన్ని కోర్టు తప్పుబట్టింది. ‘ఈ తీర్పు ద్వారా ఈ కోర్టు మరోసారి పునరుద్ఘాటిస్తుంది.. ప్రభుత్వం, పరిపాలన యంత్రాంగం న్యాయమూర్తులకు అవసరమైన, ఆధునిక మౌలిక సదుపాయాలను, సాక్షులకు రక్షణ అందించగలినప్పటికీ అది న్యాయమూర్తికి సున్నితమైన హృదయాన్ని సృష్టించదు. రాజ్యాంగం, దేశ పౌరులకు తన ప్రమాణం, సేవకు కట్టుబడి ఉన్న తన విధిలో భాగంగా న్యాయమూర్తి స్వయంగా దీనిని నిర్దేశించుకోవాలి’అని కోర్టు పేర్కొంది.
‘ప్రత్యేకించి లైంగిక వేధింపుల కేసుల్లో విచారణను రికార్డింగ్ చేసేటప్పుడు, నిర్వహించేటప్పుడు సున్నిత హృదయాన్ని మాత్రమే కాకుండా అప్రమత్తంగా ఉండే మనస్సును కలిగి ఉండటం ప్రతి న్యాయస్థానం విధి.. తద్వారా సంబంధం లేని విషయాలకు తావుండదు.. విచారణ దిశ మారదు.. బాధితులకు మరింత వేదన కలిగించదు..’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
సున్నితత్వం, తదుపరి వేధింపుల నుంచి రక్షణ సూత్రానికి కట్టుబడి ఉన్నప్పుడు.. బాధితురాలు తన తండ్రి లైంగికంగా వేధించినట్టు వివరించిన రహస్య నివేదికపై విచారణ సమంలో ఆమెను ప్రశ్నించారని కోర్టు గమనించింది. ‘12 సంవత్సరాల వయస్సులో ఉన్న ఆ చిన్నారి అనుభవించే ఆందోళన, అసౌకర్యాన్ని ఈ కోర్టు స్వయంగా గమనించింది.. ఒకవేళ ఆమె తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడినప్పటికీ అతడి చర్యలతో విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది’ అని కోర్టు పేర్కొంది. బలహీనమైన వ్యక్తులు, పిల్లల సాక్షులుగా ఉంటే ఎలా వ్యవహరించాలో న్యాయమూర్తులు మరచిపోకూడదని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa