ఏపీ సీఎం జగన్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పీఏ పాలెం వైఎస్సార్ స్టేడియంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అపోలో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించి ప్రసంగిస్తారు. బీచ్ రోడ్డులో 'సీ హారియర్' యుద్ధ విమాన మ్యూజియంను, రామ్ నగర్ లో VMRDA కాంప్లెక్స్, ఎంవీపీలో ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను ప్రారంభిస్తారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు సీఎం శంకుస్థాపన చేస్తారు.