ఇంటిగ్రేటడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసిసిసి) పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసేలా తగిన చర్యలను తీసుకోవాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత అన్నారు. గురువారం రాత్రి కాంట్రక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. సమీక్షలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ పాల్గొన్నారు.