ఏపీలోని తిరుపతి జిల్లాలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. యర్రావారిపాలెం మండలం ఎల్లమంద గ్రామానికి చెందిన నాగముని(66) అనే వృద్ధుడు స్నానం చేసేందుకు చెరువులో దిగాడు. అయితే చేపల వలకు చిక్కి చెరువులో మునిగిపోయాడు. అక్కడే ఉన్న నాగముని మనవలు జగదీష్ (14), మణికంఠ (12) తాతయ్యను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.