రాజస్థాన్ రాష్ట్రంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైయస్సార్ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, అనంతరం స్పందన కార్యక్రమంలో మండల తహసీల్దార్ బి.జయన్నకు వినతి పత్రం అందజేశారు.