చైనా జనాభా తగ్గిపోతుండడంతో ఆ దేశం కొత్త కార్యక్రమాన్ని చేపడుతోంది. ‘పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి’ అని ప్రచారం చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ‘కొత్త తరం’ పేరుతో దేశంలోని 20 నగరాల్లో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇందులో భాగంగా పెళ్లికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, అధిక కట్నాలను అరికట్టడం, పిల్లలకు సంబంధించి తల్లిదండ్రుల బాధ్యతలను పంచుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు.