కడప జిల్లా ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు వేసవి సెలవుల దృష్ట్యా విహారయాత్రలకు వెళ్లేందుకు పలు పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. వేళంగణి, అరుణాచలం, ఊటీ, గోవా, షిర్డి తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. కడప డిపో నుంచి ప్రతి శుక్రవారం అరకోణం, కంచి, చిదంరం, నాగపట్నం, వేళంగణి, నాగూరు పెద్దలకు రానుపోను రూ. 2, 200, పిల్లలకు రూ. 1100 టిక్కెట్టు ధర నిర్ణయించారు.
ప్రతి పౌర్ణమికి శైవక్షేత్రాల దర్శనానికి కడప నుంచి అరుణాచలానికి సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సు సౌకర్యం కలదు. రానుపోను రూ. 1050, పిల్లలకు రూ. 525 నిర్ణయించారు. కడప నుంచి ఊటికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశారు. రానుపోను పెద్దలకు రూ. 2700, పిల్లలకు రూ. 1350 టిక్కెట్టు ధర కేటాయించారు. ప్రత్యేకంగా గోవాకు ఇంద్ర శీతల బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. రానుపోను పెద్దలకు రూ. 3000, పిల్లలకు రూ. 2250 టిక్కెట్టు ఉంటుంది. అలానే షిర్డికి ప్రత్యేకంగా ఇంద్ర ఏసీ బస్సు రానుపోను పెద్దలకు రూ. 5000, పిల్లలకు రూ. 4000 చొప్పున టిక్కెట్టు ధర నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు కడప ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్ లో సంప్రదించాలి అని తెలిపారు.