ధర్మవరం పట్టణంలోని 21 వ వార్డు సిద్దయ్యగుట్టలో మంగళవారం అంతర్జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వార్డు కౌన్సిలర్ కత్తే ఆదిలక్ష్మి, వార్డ్ వైసిపి ఇన్చార్జ్ కత్తే పెద్దన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్తే పెద్దన్న మాట్లాడుతూ. ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డెంగ్యూ నివారణకు సహకరించాలని కోరారు. అనంతరం పట్టణంలో డెంగ్యూ వ్యాధి పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు జయరాం నాయక్, శ్రావణి, శ్వేత చంద్రిక పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa