నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) ఆరు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది. హర్యాణా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లో 122 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. టెర్రర్-మాదక ద్రవ్యాల స్మగ్లర్లు-గ్యాంగ్‌స్టర్ల అనుబంధ కేసులకు సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద నెట్ వర్క్ లకు నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించే వారి కోసం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa