మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పెళ్లికి కొద్దిసేపటి ముందే వధవు, వరుడు విషం తాగారు. పెళ్లికూతురు చాలా రోజులుగా వరుడిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోంది. ఈ పరిస్థితిలో, తన కెరీర్ కారణంగా పెళ్లికి రెండేళ్ల సమయం ఇవ్వాలని అబ్బాయి కోరగా, తిరస్కరించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంగళవారం వీరిద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వరుడు విషం తాగగా, ఈ విషయం తెలిసి వధువు కూడా పాయిజన్ తాగేసింది. వరుడు చనిపోగా, వధువు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.