ములకలచెరువు మండలంలోని బురకాయలకోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ఉత్సవాలు వైభవంగా ముగిసాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రథోత్సవం, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగాణంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు.