పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్ ఫేస్-4 లో పాత గుంటూరు కు చెందిన పోలిశెట్టి బ్రహ్మయ్య రామా మోటార్స్ వర్క్ పేరుతో కార్లు రిపేరు షెడ్డు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 19న చిలకలూరిపేటకు చెందిన ఏ ఈ శ్రీనివాసరావు కారును మరమ్మత్తుల కోసం షెడ్డుకు తెచ్చారు. దానికి తాళం వేసి పక్కన పెట్టారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు కారును ఎత్తుకుపోయారు. షెడ్డు నిర్వాహకుడు బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గురువారం సిఐ బండారు సురేష్ బాబు తెలిపారు.