కార్వేటి నగరం నుండి పచ్చికా పల్లం వరకు ప్రస్తుతం ఉన్న సింగిల్ తారురోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలని కోరుతూ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొన్నా యుగంధర్ గురువారం పాదయాత్ర ప్రారంభించారు. కార్వేటినగరం మండలం కేంద్రంలోని వేణుగోపా లస్వామి ఆలయంలో పూజలు చేసి పాద యాత్రను ప్రారంభించారు. కార్వే టినగరం బీసీ కాలనీ నుండి విజయమాంబా పురంగ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. రోడ్లను బాగు చేయాలని చేస్తున్న పాదయా త్రకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అడ్డంకులను సృష్టించారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతదూరం అయినా వెళతానని యుగంధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షుడు శోభన్ బాబు, విజయ్ సెల్వి, రాఘవ, విజయ్, చిరంజీవి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.