భారతీయ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయాన్ని మే 21 తేదీ ఆదివారం నాడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు. గుంటూరులోని ఆటోనగర్ ఏఎస్ కన్వెన్షన్ వెనుక ఐదు అంతస్తులతో పార్టీ కార్యాలయం నిర్మించారు. కార్యకర్తల సమావేశ మందిరం, నాయకుల క్యాబిన్లు, రాష్ట్ర అధ్యక్షుడి ఛాంబర్ తో పాటు 16 నివాస గదులతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.