వేసవి సెలవుల్లో రైల్వే శాఖకు రద్దీ విపరీతంగా పెరుగుతుంది. దీంతో ఈ రద్దీని తట్టుకునేందుకు 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాట్నా, ఢిల్లీ, వైజాగ్, ముంబయి వంటి ప్రధాన నగరాల మీదుగా వీటిని నడపనున్నట్లు తెలిపింది. ప్రధాన మార్గాల్లో 6,369 ట్రిప్పులు నడపునున్నామని, గతేడాది పోలిస్తే ఇది 1,770 ట్రిప్పులు అధికమని తెలిపింది.