అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై రష్యా నిషేధం విధించింది. పశ్చిమ దేశాలు తమపై ఆంక్షలు విధిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒబామాతో పాటు కమెడియన్ స్టీఫెన్ కోల్ బర్ట్ తో సహా మరో 500 మంది అమెరికన్లకు రష్యాలో ప్రవేశాన్ని నిషేధించింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, అంతకుముందు రష్యాకు చెందిన కంపెనీలు, వ్యక్తులపై యూఎస్ ఆంక్షలు విధించింది.