బ్రిటన్ దేశానికి 70 ఏళ్ల పాటు మహారాణి హోదాలో కొనసాగిన ఎలిజబెత్–2 గత ఏడాది సెప్టెంబర్ 8న మరణించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19న జరిగిన ఆమె అంత్యక్రియలకు వివిధ దేశాల నేతలు, ప్రతినిధులు భారీ ఎత్తున హాజరయ్యారు. అయితే క్వీన్ ఎలిజబెత్–2 అంత్యక్రియలకు దాదాపు రూ.1,655 కోట్లు ఖర్చయినట్లు బ్రిటన్ ట్రెజరీ విభాగం వెల్లడించింది. రాణి అంత్యక్రియల ఖర్చులను ట్రెజరీ చీఫ్ సెక్రెటరీ జాన్ గ్లెన్ పార్లమెంట్‌కు సమర్పించారు.