రాంబిల్లి మండలం నర్సాపురం సచివాలయం వాడ నర్సాపురం గ్రామంలో శాసనసభ్యులు యు. వి రమణమూర్తి రాజు (కన్నబాబు) మరియు మాజీ డిసిసిబి చైర్మన్ యు. సుకుమార్ వర్మ (తేజ)శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న పరిపాలనలో సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు అందిన లబ్ధి గురించి వివరిస్తూ అర్హత ఉండి ఇంకా ఏమైనా పథకాలు అందలేదా అని ప్రజలను అడిగి తెలుసుకుని అర్హులైన వారికి తక్షణమే ఆ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాధికారులను సచివాలయం సిబ్బందినీ ఆదేశించారు ఈ కార్యక్రమంలో ముందుగా జనసేన పార్టీ నాయకులు పెండింగ్లో ఉన్న ప్యాకేజీలు వీలైనంత తొందరగా లబ్ధిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్ తో మీ సమస్యలపైనే మాట్లాడుతున్నామని వీలైనంత తొందరగా ప్యాకేజీలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దుళ్లి నాగరాజు, మండల కన్వీనర్ పిన్నమరాజు కిషోర్, మండల అధికారులువాలంటీర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.